రానున్న ఎన్నికల్లో జనసేనతో కూడిన ప్రభుత్వం రావాలి..అదే పవన్ లక్ష్యం. ఎలాగో సొంతంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం. ఆ విషయం పవన్‌కు అర్ధమైంది. మళ్ళీ ఒంటరిగా బరిలో దిగితే భారీగా ఓట్లు చీలిపోయి వైసీపీకే బెనిఫిట్ అవుతుంది. అలాగే జనసేన గెలిస్తే ఓ 10 సీట్లు గెలుస్తుంది. దానివల్ల జనసేనకు ఒరిగేది ఏమి లేదు. అదే టిడిపితో కలిసి ముందుకెళితే ఓట్లు చీలవు.అలాగే జనసేనకు ఇంకా ఎక్కువ సీట్లు రావచ్చు. అన్నిటికంటే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో జనసేనకు భాగస్వామ్యం దక్కుతుంది.
అందుకే టిడిపితో కలిసి పవన్ ముందుకెళుతున్నారు. ఇక పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు దక్కుతాయి. ఇక ఆ సీట్లలో గెలుపే లక్ష్యంగా పవన్ గేమ్ మొదలైంది. వారాహి బస్సుతో పవన్ యాత్ర షురూ కానుంది. జనసేనకు పట్టున్న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. ఇక టిడిపితో కలిసి అధికారంలోకి రావడానికి పవన్ మొదలుపెడుతున ఈ పవర్ గేమ్ తో వైసీపీకి కాస్త రిస్క్ ఎక్కువ అనే చెప్పాలి. ఎంతమంది కలిసొచ్చిన తమకు ఇబ్బంది లేదని పైకి వైసీపీ నేతలు చెబుతున్నారు గాని..టిడిపి, జనసేన కలిస్తే మాత్రం వైసీపీకి ఇబ్బందులు తప్పవు.
ఇక తాను ఒంటరి అని..అందరూ కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని జగన్ జనంలో సానుభూతి పొందడానికి చూస్తున్నారు. కానీ దానికి కౌంటరుగా జనంలోకి వెళుతున్న పవన్..జగన్ ప్రభుత్వంలో అన్నీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే తమ ప్రభుత్వంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చే విధంగా పవన్ ముందుకెళ్తారని తెలుస్తుంది.
అయితే పవన్ మాటలు ప్రజలు ఎంతవరకు నమ్ముతారు..టిడిపి, జనసేన పొత్తు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక టిడిపి, జనసేన పొత్తుకు వైసీపీ ఏ మేర చెక్ పెడుతుందో కూడా చూడాలి.