రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్సన్‌గా వేద ర‌జ‌ని.. నియామకపత్రం అందజేత

-

గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్‌ చైర్మన్‌గా ఉన్న గాయ‌కుడు సాయిచంద్‌.. ఇటీవ‌లే గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సాయిచంద్ భార్య ర‌జ‌నికే ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌జెప్పాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు సాయిచంద్ భార్య ర‌జ‌నిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే.. రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్సన్‌గా వేద ర‌జ‌నిని ప్రభుత్వం నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు సాయిచంద్ నివాసానికి వెళ్లిన‌ ప్రభుత్వ విప్ బాల్క సుమ‌న్ గిడ్డంగుల శాఖ కార్పొరేష‌న్ నియామ‌క ప‌త్రాన్ని వేద ర‌జనికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సాయిచంద్ చిత్రప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

సాయిచంద్‌ కుటుంబానికి రూ. కోటిన్నర ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సమకూరుస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. సాయిచంద్ 1984, సెప్టెంబరు 20న తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, అమరచింత గ్రామంలో వెంకటరాములు, మణెమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన అమరచింతలో పదో తరగతి, ఆత్మకూరులో ఇంటర్, హైదరాబాద్‌లో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి
చేశాడు. సాయిచంద్‌కు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైన రజనీని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు  చరీష్ (చెర్రీస్), కుమార్తె నది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news