కేసీఆర్‌ నీ పాల వద్దంటూ.. ఆదివాసీలు నిరసన

-

వద్దు బాబూ…ఈ కేసీఆర్ పాలన అంటూ నినాదాలు చేస్తూ.. ఆదిలాబాద్‌ జిల్లా కోటపల్లి మండలం కొండంపేట గ్రామ ఆదివాసీలు శనివారం స్థానిక అటవీ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఎఫ్ ఆర్ సీ కమిటీ చైర్మన్ నైతం మహేష్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుండి సాగుచేసుకుంటున్న పొడుభూములకు ఫారెస్ట్ అధికారులు అడ్డం వస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పోడుపట్టాల కోసం శ్రీకారం చుట్టి ఫారెస్ట్ అధికారులకు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వగా కొండంపేట గ్రామంలో సర్వే చేసిన అధికారి నిర్లక్ష్యం కారణంగా తప్పులు దొర్లినట్టు తెలిపారు.

దాంతో పట్టాల పంపిణీ చేయలేదని పేర్కొన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కొండంపేట ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్​చేశారు. పోడుభూములకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించి కొండంపేట ఆదివాసీలకు పట్టాలు ఇచ్చేలా న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆయన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కురుమ రాజేష్, సంతోష్, తలండి సందీప్, సాయి, చేరాను శ్రవణ్, సమన్నా బుచ్చక్క, రజిని పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news