ఇవాళ దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు భేటీ

-

ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల BJP నేతలు హైదరాబాద్ లో బేటీ కానున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సీనియర్ నేత B.L. సంతోష్ పాల్గొంటారు.

తెలంగాణ, తమిళనాడు, AP, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, పాండిచ్చేరి, కేంద్ర పాలిత ప్రాంతాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జీలు సమావేశంలో పాల్గొంటారు. కాగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీకి మరో షాక్ తగులనుంది. బీజేపీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారట వివేక్, విజయశాంతి. నిన్న వరంగల్‌ లో జరిగిన ప్రధాని మోడీ సభకు డుమ్మా కొట్టిన వివేక్ వెంకటస్వామి, విజయశాంతి.. పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బీజేపీ పార్టీ కార్యక్రమాలకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు వీ6 ఛానల్ ఓనర్, బీజేపీ నేత గడ్డం వివేక్. దీంతో వీరిద్దరూ బీజేపీని వీడతారని జోరుగా ప్రచారం అయితే.. సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news