చిరంజీవికి, పవన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది : పేర్ని నాని

-

వైసీపీ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కావాలనే విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.చంద్రబాబు ఇచ్చే తప్పుడు లెక్కలతో విషం చిమ్ముతున్నారన్నారు. నోటికి హద్దు లేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.పవన్ మాటల్లో చంద్రబాబుపై ప్రేమ కనిపించిందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ అంటే పవన్, చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు.జగన్ ను ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

May lose ministry: Perni Nani

చిరంజీవికి, పవన్ కల్యాణ్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పేర్ని నాని సోమవారం విమర్శలు గుప్పించారు. వాలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నపై నాని స్పందించారు. చంద్రబాబుతో రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడే కరెక్ట్ అని చిరంజీవి అభిప్రాయపడ్డారని, అందుకే కొన్నిరోజుల క్రితం ఆయన రాజకీయాలకు తన కంటే తన తమ్ముడు సరిపోతాడని వ్యాఖ్యానించాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో జత కలవడం, అబద్దాలు చెప్పడం, విషం చిమ్మడం చిరంజీవి వల్ల కావని, అవి పవన్ మాత్రమే చేయగలడని విమర్శించారు. రాజకీయాలకు తన తమ్ముడు సూట్ అవుతాడని చిరంజీవి మహాత్ముడు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news