బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్..అందరూ చంద్రబాబు మనషులే.!

-

తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు లేరు..ఆయన ఏపీలోనే రాజకీయం చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడ కూడా టి‌డి‌పి ఉండేది కాబట్టి రాజకీయం చేశారు. దెబ్బతిన్నారు. ఆయనని విలన్ గా చేసి కే‌సి‌ఆర్ రాజకీయంగా లబ్దిపొందారు..అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేయలేదు..తెలంగాణ అభివృద్ధి కోసమే పనిచేశారు..అయినా ఇప్పుడు ఆయన అక్కడ లేరు..టి‌డి‌పి కూడా పెద్దగా యాక్టివ్ లేదు..కానీ ఇప్పటికీ ఆయన పేరుతోనే రాజకీయం చేస్తున్నారు.

కేవలం చంద్రబాబుని విలన్ గా చూపించి మళ్ళీ లబ్ది పొందాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు..ఇటు చంద్రబాబు పేరుతో రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అసలు అక్కడ రాజకీయంతో ఆయనకేమి సంబంధం. మీరు మీరు తిట్టుకుంటూ మధ్యలో చంద్రబాబుని లాగి రాజకీయం చేస్తారు ఎందుకు? ఆయన తెలంగాణకు అన్యాయం ఏమి చేయలేదు? కదా అంటూ సగటు తెలుగుదేశం అభిమాని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే నిజమే ఇప్పుడు బాబు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు..కానీ బి‌ఆర్‌ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టడానికి చంద్రబాబు పేరు తీసి..తిడుతున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై రచ్చ విషయంలో అప్పుడు బాబు వ్యవసాయం దండగ అని అన్నారని, ఇప్పుడు ఛోటా చంద్రబాబు అయిన రేవంత్ ఉచిత విద్యుత్ 3 గంటలు చాలు అని అంటున్నారని కే‌టి‌ఆర్ విమర్శించారు.

అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ని జగన్ ఏపీకి తీసుకెళ్లారని, ఇప్పుడు తెలంగాణలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ అని అంటున్నారు. అయితే బి‌ఆర్‌ఎస్ లో సగం మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ టి‌డి‌పి నుంచే వచ్చారని, బాబు దగ్గరే పనిచేశారని, కే‌సి‌ఆర్ కూడా అక్కడ నుంచే వచ్చారని, బాబు దగ్గర చెప్పులు మోశారని రేవంత్ అంటున్నారు. ఇక రేవంత్‌కు సపోర్ట్‌గా కాంగ్రెస్ నేతలు కూడా కే‌టి‌ఆర్ పై ఫైర్ అవుతున్నారు.

తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నీ పోచారం శ్రీనివాసరెడ్డి చంద్రబాబు పంచన లేడా? నీ దయాకర్ రావు చంద్రబాబు పంచన లేడా? నీ తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు పంచన లేడా? గంగుల కమలాకర్‌ది ముందు టీడీపీ కాదా? బాబూ కేసీఆర్ అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? రేవంత్ రెడ్డి గురించి తెలుసుకుని మాట్లాడండి. చంద్రబాబు దయా దక్షిణ్యాలతోనే బీఆర్ఎస్ నేతలకు రాజకీయ భిక్ష. నీ మంత్రి వర్గం మొత్తం టీడీపీలోనే పుట్టింది.” అని విమర్శించారు. ఇక విమర్శలు చూస్తుంటే తెలంగాణలో అటు కాంగ్రెస్, ఇటు బి‌ఆర్‌ఎస్ లోనే కాదు…బి‌జే‌పిలో కూడా చంద్రబాబు మనషులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూడు పార్టీల్లోనూ టి‌డి‌పి నేతలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news