ఎడిట్ నోట్: కుడి ఎడమైతే..!

-

కుడి ఎడమైతే..పొరపాటే లేదే..అనేది తెలుగు పాత సినిమాలోని పాట..కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆ పాటలోనే మాటలే జరుగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతో అవకాశం ఎదురుచూస్తున్న నేతలు..అటు, ఇటు జంప్ అయిపోతున్నారు. ఉన్న పార్టీలో సీటు లేకపోతే మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇటీవల కాలంలో ఈ జంపింగులు ఎక్కువ నడుస్తున్నాయి. అధికార బి‌ఆర్‌ఎస్ లోకి వలసలు మొదట నుంచి కొనసాగుతూనే ఉన్నాయి.

ఎందుకంటే అది అధికార పార్టీ కాబట్టి..ఏ నాయకుడైన అధికారం కోసమే చూస్తారు కాబట్టి..ఆ పార్టీలోకి వలసలు కామన్. మధ్యలో బి‌జే‌పి రేసులోకి వచ్చింది. రెండు ఉపఎన్నికల్లో గెలిచేసరికి ఆ పార్టీలోకి వలసలు కొనసాగాయి. కానీ ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వలసల జోరు కొనసాగుతుంది. అయితే ఎన్నికల సమయం దగ్గరకొచ్చేసింది. అలా కాంగ్రెస్ లోకి వలసలు వెళ్ళడం వల్ల బి‌ఆర్‌ఎస్ కు నష్టం. అందుకే బి‌ఆర్‌ఎస్ సైతం రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టింది. కాంగ్రెస్ నేతలని బి‌ఆర్‌ఎస్ లోకి లాగుతున్నారు.

అంటే బి‌ఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వెళుతుంటే…కాంగ్రెస్ నేతలు బి‌ఆర్‌ఎస్ లోకి వెళుతున్నారు. అందుకే కుడి ఎడమైతే అన్నట్లు జంపింగులు నడుస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లోకి పలువురు నేతలు వచ్చారు. ఇంకా మరికొందరు చేరడానికి రెడీగా ఉన్నారు. ఇటు బి‌ఆర్‌ఎస్ లోకి వలస వస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ వీక్ గా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన కాంగ్రెస్ నేతలని లాగుతున్నారు.

తాజాగా ఉమ్మడి నల్గొండలో అనిల్ రెడ్డిని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఓ కాంగ్రెస్ సీనియర్ నేతని సైతం బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే కరీంనగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్..బి‌ఆర్‌ఎస్ లోకి వెళుతున్నారనే ప్రచారం వస్తుంది. కానీ దీనిపై పొన్నం ఇంతవరకు స్పందించలేదు. మొత్తానికైతే ఎన్నికల షెడ్యూల్ వస్తే..ఇంకా జంపింగులు ముమ్మరం అవుతాయనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news