ఎన్టీఆర్‌తో నటించడంపై జాన్వీ కపూర్‌ కీలక వ్యాఖ్యలు

-

జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు.దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని సౌత్ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఈమె కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు.

Janhvi Kapoor Called 'Indian Kim Kardashian', Gets Trolled After Shanaya  Kapoor As She Dons A Sequined Bodycon Dress

అయితే తాజాగా జాన్వీ కపూర్ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా మాట్లాడిన ఆమె.. ‘ఎన్టీఆర్- కొరటాల శివ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఎలాగైనా ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించాను. మొత్తానికి సెలెక్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news