మధ్యాహ్నం 2 తర్వాత పిల్లలకు నో పర్మిషన్.. టీటీడీ కీలక నిర్ణయం

-

అలిపిరి నడక మార్గంలో చిరుత పులుల సంచారం, చిన్నారులపై దాడులతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. ఇటీవల నడక మార్గంలో ఓ చిన్నారిపై దాడి చేసి చిరుత చంపేయడం అందరినీ కలచివేస్తోంది. భక్తుల రక్షణ కోసం ముఖ్యంగా తిరుమలకు వచ్చే చిన్నారుల రక్షణ కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్ళే భక్తులకు ఆంక్షలు విధించింది. ఇకపై అలిపిరి‌నడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ళ లోపు చిన్నారులకి అలిపిరి నడక మార్గంలో అనుమతిని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

How many steps are to be climbed to reach Tirumala from Tirupathi? - Quora

అటు, పోలీసులు 7వ మైలు వద్ద పిల్లల చేతికి ట్యాగ్ లు వేస్తున్నారు. ఈ ట్యాగ్ పై చిన్నారి పేరు, ఫోన్ నెంబరు సహా తల్లిదండ్రుల వివరాలు, పోలీస్ విభాగం టోల్ ఫ్రీ నెంబరు ఉంటాయి. అదే సమయంలో, ఘాట్ రోడ్లలో బైక్ లను సాయంత్రం 6 గంటల తర్వాత అనుమతించబోమని టీటీడీ వెల్లడించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news