ఈ టెకీ ఖరీదే.. రోజు గంట వర్క్‌.. ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం

-

ఆర్థిక మాంద్యం ప్రభావంతో కంపెనీ గత కొద్ది నెలలుగా వరుసగా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ భారీ జీతం అందుకుంటున్నాడు. అదికూడా రోజుకు గంటసేపు మాత్రమే పని చేసి. డెవోన్ (పేరు మార్చడం జరిగింది) గూగుల్ లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నాడు. విశేషం ఏంటంటే అతడు రోజుకు ఒక గంట మాత్రమే గూగుల్ కోసం పనిచేస్తాడు. మిగతా సమయం అంతా తన సొంత స్టార్టప్ కోసం వెచ్చిస్తాడు. ఇక రోజుకు గంట చొప్పున చేసే ఆ ఉద్యోగానికి గాను డెవోన్ అందుకునే జీతం ఎంతో తెలుసా… సంవత్సరానికి అక్షరాలా రూ.1.2 కోట్లు.

What is Google? - Tech Monitor

ఎంతో చురుకైన ఉద్యోగిగా గుర్తింపు పొందిన అతడు పనిచేసేది రోజుకు గంటే అయినా, చేసినంతలో అత్యంత నాణ్యమైన పనితీరు
కనబర్చేవాడు. గూగుల్ నుంచి అతడు మెరుగైన వేతనం అందుకోవడానికి కారణం ఇదే. ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే అతడు గూగుల్ లోనే ఇంటర్న్ షిప్ చేశాడు. అప్పట్లో అప్రెంటిస్ గా ఉన్నప్పుడే రోజుకు రెండు గంటలు పనిచేసేవాడు. అతడు ఎంత ప్రతిభావంతుడు అంటే… అతడికి అప్పగించిన కోడింగ్ పనిని ఇంటర్న్ షిప్ లో చేరిన మొదట్లోనే పూర్తిచేశాడట.

ఇంతజేసీ మనవాడు ఆఫీసు కూడా రాడు. ఇంటివద్ద నుంచే పనిచేస్తాడు. దానిపై డెవోన్ ఫార్చ్యూన్ పత్రికతో మాట్లాడుతూ, తన మేనేజర్ చాలా మంచివాడని, ఆఫీసుకు రాకపోయినా ఏమీ అనడని సంతోషంగా చెప్పాడు. సాధారణంగా వారంలో కొన్నిరోజుల పాటు ఆఫీసుకు తప్పనిసరిగా రావాలని గూగుల్ తన ఉద్యోగులకు నిబంధన విధించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం మేనేజర్లకు అప్పగించింది. మేనేజర్ల పని సరైన ఉత్పాదకత రాబట్టడమే. డెవోన్ వంటి ఉద్యోగులు నాణ్యమైన పనితీరు కనబరుస్తుంటే, వారు ఎక్కడ్నించి పనిచేశారన్నది మేనేజర్లకు పెద్ద పట్టింపు కాబోదు. ఈ నేపథ్యంలో, ఒకవేళ గూగుల్ నుంచి ఏమైనా హెచ్చరిక వస్తే తప్ప తాను ఇంటి నుంచే పనిచేస్తానని డెవోన్ చెబుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news