ప్రభుత్వం అందించే సాయాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే సతీష్

-

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్‌ బెడ్‌ రూం పథకాన్ని అర్హులు అందరూ సద్వినియోగించాలని అన్నారు ఎమ్మెల్య ఒడితల సతీష్‌ కుమార్‌. ఇవాళ హుస్నాబాద్‌ పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో మున్సిపల్ పరిధిలోని 260 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఇల్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్న సీఎంను ఆశీర్వదించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. లబ్ధిదారుల కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని ఎవరు నిరాశ చెందుతున్నారో అలాంటి వారికోసం గృహలక్ష్మి పథకం వర్తింపజేసి రూ. 3 లక్షలు ప్రభుత్వం సహాయం చేస్తుందని దీనిని అర్హులందరూ వినియోగించుకొని ఇల్లు నిర్మించుకోవాలని భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం యొక్క సర్వతో ముఖాభివృద్దికి ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బెన్ షాలోమ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news