ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు చేస్తూ యుద్ధాన్ని ఆ దేశం వైపు మళ్లించింది. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఉక్రెయిన్‌పై తాజాగా రష్యా దాడికి తెగబడింది. ఈ దాడుల్లో 48 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఖర్కీవ్ ప్రాంతంలోని హ్రోజా గ్రామంలో ఒక దుకాణం, కేఫ్‌పై రష్యా బలగాలు గురువారం మధ్యాహ్నం దాడులు చేశాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 48 మంది మరణించారని.. మృతుల్లో ఆరేళ్ల బాలుడు కూడా ఉన్నాడని వెల్లడించారు. మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధ్రువీకరించారు. రష్యన్ రాకెట్ దాడి క్రూరమైన నేరమని.. ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన ఉగ్రవాద దాడి అని జెలెన్స్కీ అన్నారు. మరోవైపు.. ఈయూ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతానికి సాయం చేయాలని పాశ్చాత్య మిత్రదేశాలను అభ్యర్థించారు.