దక్షిణ భారతదేశ బీహార్ గా ఏపీ : నారా లోకేష్

-

వైసీపీ పాలనలో దక్షిణ భారత బీహార్ గా ఏపీ మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను టీడీపీ బృందం కలిసింది. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్ కు నరనరానా కక్ష సాదింపే ఉందని లోకేష్ ఆరోపించారు. టీడీపీ సానుభూతి పరులపై 6 వేల కేసులు పెట్టారన్నారు. చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్ ను కోరామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ప్రజల కోసం పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు. భయం మా బయోడేటాలోనే లేదు. అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్తాం. దొంగ ఓట్లు చేర్చడంపై మా పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి పేరు పైనే దొంగ ఓట్లు ఉన్నాయి. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ బృందం బుధవారం ఎన్నికల సంఘాన్ని కలుస్తుంది. జనసేనతో సంప్రదింపులు జరిపాం. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం. రాష్ట్రంలో కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యలపై జనసేనతో కలిసి ప్రజా ఉద్యమం చేపడదాం అని లోకేష్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news