రేపు రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈనెల 18న సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారం నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించనున్నారు. ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్ కి సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ ఏకే మహంతి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్, ఇంటెలిజెన్స్ సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిదికాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు.  సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్డు, బైసన్ రోడ్డు, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నామ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 

Read more RELATED
Recommended to you

Latest news