నాగ చైతన్య తండేల్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. ఊరమాస్ అసలు…!

-

నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో తండేల్ సినిమా రాబోతోంది. ఊర మాస్ లుక్ లో అదరగొట్టేసాడు నాగచైతన్య. ఈరోజు ఈ మూవీ గ్లిమ్ప్స్ రిలీజ్ అయింది. నాగచైతన్య మొన్నామధ్య కస్టడీ సినిమాలో నటించాడు. తమిళ డైరెక్టర్ ప్రభు దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా కస్టడీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సాయి పల్లవి తో నాగచైతన్య తండేల్ తో రాబోతున్నాడు. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డిఎస్పి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది.

తాజాగా ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ అయింది. ఇది ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. ఇండియన్ ఫిషర్ మాన్ ని పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేయడం తర్వాత అక్కడి నుండి బయటకి రావడం అనేది ప్రధానంగా గ్లిమ్ప్స్ లో చూపించడం జరిగింది. నాగచైతన్య డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాస తో నాగచైతన్య ఆకట్టుకున్నాడు. ఈ సినిమా నాగచైతన్య కి ఎంతవరకు హిట్ ని తీసుకొస్తుంది అనేది చూడాలి. ఈ సినిమాలో చైతు గుజరాత్ సముద్ర తీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి రోల్ చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news