ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టగానే చాలా మంది ఆసక్తికరంగా చూసిన పరిణామం… పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో నెరపిన స్నేహ సంబంధాలు… గత అయిదేళ్ళు గా చంద్రబాబు చేయలేని పనులను జగన్ చేసారు. ఇక చంద్రబాబు కయ్యానికి కాలు దువ్వితే తాను స్నేహానికి విలువ ఇస్తానని జగన్ తన భేటీలతో స్పష్టంగా చెప్పారు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి భేటీలు హైలెట్ అయ్యారు. ఎన్నో సమస్యలకు తాము పరిష్కారం చూపిస్తామని… నదీ జలాల విషయంలో తగువులు మంచివి కాదని చెప్పారు.
హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు ఎప్పటికి అయిన తెలంగాణకు ఇవ్వాలి కాబట్టి జగన్ ఇప్పుడే వాటిని కెసిఆర్ కు అప్పగించారు. తెలుగుదేశం ఈ విషయంలో రాద్దాంతం చేసినా జగన్ మాత్రం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ స్నేహం మాత్రం కొంత మందికి రుచించలేదని అంటున్నారు… వాస్తవానికి ఈ సమస్యలను కేంద్రం సమక్షంలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. కాని జగన్, కెసిఆర్ మాత్రం కేంద్రం ప్రమేయం లేకుండా ముందుకి వెళ్ళారు. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు ఒక పెద్ద మనిషి మోశారు… మీ ప్రాధాన్యత తగ్గిస్తున్నారని,
ఒకరకంగా మిమ్మల్ని బద్నాం చేస్తున్నారని ఢిల్లీ పెద్దలకు చెప్పారు కొందరు. గవర్నర్ గా ఉన్న నరసింహన్ కూడా దీనికి సహకరించారని, ఆయన కనుసన్నల్లోనే వీళ్ళు నదీ జలాల గురించి మాట్లాడుకున్నారని, విభజన సమస్యలను పరిష్కరించుకునే విధంగా వెళ్ళారని చెప్పారట. అందుకే వెంటనే గవర్నర్ గా ఉన్న నరసింహన్ ని కేంద్రం మార్చింది తమ పార్టీ నేతను నియమించింది అంటున్నారు. తెలుగుదేశం ఎంపీల్లో ఒకరు కూడా వీరి స్నేహం మీద ఫిర్యాదు చేసారట. ఆ పెద్ద మనిషి ఒక పారిశ్రామిక వేత్త అని… జగన్ తీసుకున్న ఒక నిర్ణయంతో నష్టపోయి… కేంద్రానికి నివేదికలు ఇచ్చారని సమాచారం.