ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రశాంతంగా ఉన్నా సరే జరిగే ప్రచారాలతో ఎప్పటికప్పుడు ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న నాయకులను పార్టీ మారతారు అంటూ అటు మీడియా… ఇటు సోషల్ మీడియా ఎదోకరకంగా ప్రచారం చేస్తూనే ఉంటుంది… ఆ నేత పార్టీ మారుతున్నారు, ఈ నేత అసహనంగా ఉన్నారు, ఆయన మీద మరో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసాడు అంటూ ఏదోక ప్రచారంతో నాయకులను వార్తల్లో ఉంచుతారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఈ ప్రచారం పాళ్ళు కాస్త ఎక్కువయ్యాయి.
తాజాగా మరో వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఒక కీలక వ్యక్తికి కేంద్రం జనవరిలో షాక్ ఇస్తుంది అనే ప్రచారం ఊపందుకుంది. ఆయనను ముందు ఆదరించిన కేంద్రం ఇప్పుడు కొన్ని వ్యవస్థల ద్వారా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని, ఆయన కింద జరుగుతున్న ప్రతీ విషయాన్ని కేంద్ర పెద్దలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో ఆయన తీసుకునే నిర్ణయాల మీద కాస్త అసహనంగా కూడా కేంద్రం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈ సంచలనం వచ్చే నెల జరిగే అవకాశం ఉందని,
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం కూడా జరుగుతుందని, ఇన్నాళ్ళు పదవులకు దూరంగా ఉన్న వాళ్ళు కోరిన పదవిలోకి వస్తారని అంటున్నారు. లేదా ఆ కీలక నేత కుటుంబ సభ్యులే పదవులు చేపట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న ఒక వ్యక్తి కేంద్రంగా కేంద్రం రాజకీయ ఆట మొదలుపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అది జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని కేంద్రం తన చెప్పు చేతల్లోకి తీసుకునే అవకాశం ఉందని, ఇది కొందరికి లాభిస్తుందని అంటున్నారు.