99 శాతం హమీలు అమలు చేసిన తమ ముందు 10 శాతం హామీలు కూడా అమలు చేయని చంద్రబాబు నిలబడగలరా..? అని ప్రశ్నించారు సీఎం జగన్. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మీమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ.. జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడి పేరు చంద్రబాబు.
అరుంధతి సినిమాలో సమాధి లోంచి లేచిన పశుపతి లాగా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు పసుపు పతి .. వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు సీఎం కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడు పసుపు పతి. నోటికి వచ్చిన అబద్దాలు చెబుతున్నాడు. 2014 ఎన్నికల్లో ఇదే మాదిరిగా మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకొని.. మూడు పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లేట్ పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు. కానీ వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని తెలిపారు. అందుకే రాష్ట్రం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలిచి డబుల్ సెంచరీ కొట్టడమే లక్ష్యం అన్నారు. ఇందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు సీఎం జగన్.