హైదరాబాద్ తో పాటు ఈ జిల్లాలకు భారీ వర్షాలు – ఐఎండీ

-

తెలంగాణ ప్రజలకు అలర్ట్‌. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల తరువాత పలు జిల్లాల్లో భారీ వర్షం ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని…50-60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడవచ్చని తెలిపింది ఐఎండీ.

Heavy rains for these districts along with Hyderabad IMD

ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్..జారీ చేసింది. ఆయా జిల్లాల అధికారులను అలెర్ట్ చేసిన ఐఎండీ..ప్రజలు బయటకు రావొద్దని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news