నిఖత్ సూపర్ పంచ్.. రౌండ్ 16 లోకి ఎంట్రీ..!

-

ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ ఇండియన్ ఫ్యాన్స్ మెడల్స్ ఆశించే అథ్లెట్లలో నిఖత్ జరీన్ ఒక్కరు. తెలంగాణకు చెందిన ఈ బాక్సర్ రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందుకు తగిన విధంగానే తన మొదటి రౌండ్ లో అదరగొట్టింది నిఖత్ జరీన్. జర్మనీ కి చెందిన మాక్సి కరీనాతో జరిగిన రౌండ్ 32 మ్యాచులో 5-0 తో రౌండ్ ఆఫ్ 16 లోకి నిఖత్ జరీన్ ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ రౌండ్ ఆఫ్ 16 లో నిఖత్ జరీన్ కు గట్టి పోటీ ఎదురు కానుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రౌండ్ లో నిఖత్ చైనా కి చెందిన టాప్ సీడెడ్ బాక్సర్ అయిన వుయూ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే నిఖత్ జరీన్ తప్పకుండ ఫైనల్ వరకు వెళ్తుంది అనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి చైనా బాక్సర్ తో మన తెగుగమ్మాయి ఎలా ఫైట్ చేస్తుంది అనేది చూడాలంటే ఆగస్టు 1 మధ్యాహ్నం 2:30 గంటలవరకు వేచి ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news