సంచలన నిర్ణయం తీసుకున్న జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ఉద్యోగుల జీతాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అన్ని రకాల ప్రజాప్రతినిధుల జీతాల్లో 100 శాతం కోత విధిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం రేపింది. అదే విధంగా వారితో పాటుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర అఖిల భారత సర్వీసుల్లో,

పనిచేసే ఉద్యోగుల జీతాల్లో 60 శాతం కోత విధిస్తూ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయినా, ఆయా ఉద్యోగులకు పై దమాషాలో పెన్షన్ అందజేయను౦ది రాష్ట్ర ప్రభుత్వం.

ఇప్పటికే సబ్మిట్ చేసిన జీతాల బిల్లులను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి 50శాతం గ్రాస్ శాలరీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణా ప్రభుత్వం కూడా ముందు కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు రావడంతో వాయిదా వేస్తూ నిర్ణయం వెల్లడించింది. ఈ మేరకు కెసిఆర్ సర్కార్ ఒక జీవో కూడా విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news