పొద్దుతిరుగుడు సాగులో విత్తన రకాలు.. ఎరువుల యజమాన్యం

-

పొద్దుతిరుగుడు ఆయిల్ కు ఈరోజుల్లో ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. తక్కువ కాలంతో తక్కువ పెట్టుబడితో..అధిక లాభాలు పొందవచ్చు. ఈ పంట సాగు విధానం, విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

విత్తే కాలం:

వానాకాలంలో తేలికపాటి నేలల్లో జూన్ రెండవ వారం నుండి జులై చివరి వరకు, బరువైన నేలల్లో ఆగస్టు మధ్య వరకు విత్తుకోవచ్చు.
యాసంగిలో నవంబర్-డిసెంబర్ , జనవరి – ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు.

విత్తనశుద్ది..

ఎకరాకు 2.5- 3.0 కిలోల విత్తనం కావాలి. థయోమిథాక్సమ్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవడం వల్ల నెక్రోసిన్ వైరస్ తెగులు సవస్యను అధిగమించవచ్చు. అలాగే ఇప్రొడియాన్ 25%+ కార్బండాజిమ్ 25% మందును 2 గ్రా. కిలో విత్తనానికి పట్టిచడం వల్ల అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఉపయోగపడుతుంది. తేలిక నేలల్లో 45 సెం.మీ X 20-25 సెం.మీ. నల్లరేగడి నేలల్లో 60 సెం.మీ X 30 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి.

ఎరువుల ఎంపిక..

చివరి దక్కిలో ఎకరాకు 2-3 టన్నుల పశువుల ఎరువు చల్లుకొవాలి. వర్షాధారపు పంటకు 24 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను వేయాలి. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్ 5 మి.లీ. లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేయాలి.

కలుపు నివారణకు పంట విత్తిన 25-30 రోజుల తరువాత గుంటక/దంతితో అంతరసేద్యం చేయాలి. పొద్దుతిరుగు సాగులో అధికంగా తెల్లదోమ, తామర పురుగులు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, బూడిద తెగులు, అల్జర్నేరియా ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది.

దిగుబడి:

ఎకరాకు సుమారు 400 కిలోలు వర్షాధారం క్రింద, 400-600 కిలోల నిశ్చిత వర్షపాత పరిస్థితులలో, 800-900 కిలోలు నీటి పారుదల క్రింద దిగుబడి సాధించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news