వ్యవసాయం చేసి మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. అయితే వ్యవసాయం చేయడం అనుకున్నంత సులభం కాదు. చాలా ఖర్చు అవుతుంది రైతులకి. ట్రాక్టర్, విత్తనాలు, కూలీలు, రసాయనాలు, ఎరువులు ఇలా ఎంతో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
అయితే వాతావరణాన్ని బట్టి మనం పని చేయాల్సి ఉంటుంది. కష్టం కనుక వచ్చిందంటే అప్పులు ఎక్కువ అవుతాయి. అయితే లాభదాయకమైన పంటల్ని సాగు చేస్తే మంచిగా లాభాలు పొందొచ్చు. మరి ఎలా మంచిగా డబ్బులు పొందొచ్చు..?, ఏ పంట వెయ్యాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…
చాలా మంది రైతులు మంచిగా ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే వైట్ ముస్లి పంట కూడా మంచి ఆదాయాన్ని తీసుకు వస్తుంది. దీన్ని సఫేద్ ముస్లి అని కూడా అంటారు దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మందుల్లో కూడా దీనిని వాడతారు. గుజరాత్ లోని ఈ పంటని వేసి.. రైతులు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.
చాలా మంది రైతులు ఎక్కువగా దీన్ని వర్షా కాలంలో పండిస్తారు. దీని కేజీ ధర వెయ్యి రూపాయల నుంచి 1500 వరకు ప్రస్తుతం పలుకుతోంది. రైతులు దీనిని పండించి కంపెనీలకి నేరుగా అమ్మొచ్చు. ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా పెట్టి పంటల్ని విక్రయిస్తూ లాభాలను పొందుతున్నారు చాలా మంది రైతులు. కాబట్టి ఈ పంటని వేసి మంచి లాభాలని పొందొచ్చు దీనితో నష్టాలు కూడా రావు.