బ్యూటీ స్పీక్స్ : నెత్తి మీద స్వ‌రం – హై ఎండ్ నోట్ 

క్ష‌మ‌ను ప్రేమ‌గా అడిగాను
ఆ పిల్ల ద‌య‌ను బిక్ష‌గా ఇచ్చింది
అలాంటి  సంద‌ర్భాన త‌న దేహాల‌కు స్వేద వేదాలు వ‌ల్లించాను
క్ర‌మానుగ‌త ప్రేమ క్ర‌మానుగ‌త ఊహ అన్న‌వి ఉండవు 
ఫ‌స్ట్ కాజ్ : ఒక్క‌డే పురుషుడు అనేకం స్త్రీ ఇలాంటి ముఖం ఆముఖం ఈవేళ ఏకః పురుషః..

సాయం కాలం గాలులకూ,మ‌ధ్యాహ్నం నీడ‌ల‌కు ఏమ‌యినా పొంత‌న లేకుండా పోతోంది. జీవితం ఇచ్చినంత స్వేచ్ఛను కాలం ఇవ్వ‌డం లేదు..కాలం..జీవిత కాల స్వేచ్ఛ‌ల్లో బంధీ అవ్వ‌మ‌ని చెబుతుంద‌ని  అనుకోను..ఇప్ప‌టిలా త‌న దేహం వాకిట ప్రేమ‌ను అర్థిస్తే, ఇంకాస్త  పైకి పోయి శృంగారం కోరితే కోరిన చోట అముద్రిత స్వ‌రాలు ప్రేమ‌లు అవుతాయ‌ని అనుకోను..ముద్రిత వాంఛ‌లే ఈ ప్రేమ‌లు అని నిద్రించ‌ను. అయినా సంభోగం అన్న‌ది ఒక చోట నుంచి ఇంకో చోట..ఒక గాలి నుంచి ఇంకో గాలి అంతేనా! అందుకే ఈ వైరస్సుల కాలంలో ఈ త‌ప‌స్సులు మానుకోండి అని అంటున్నాను. కానీ ఈ జ‌నాల‌కు ఇవి అర్థం కావు..

మ‌నో వాంఛ‌లన్నీ
దేహ వాంఛ‌లు కావా?
హా ! హా ! తిక్క ప్ర‌శ్న
అవును చ‌దువు రాని వారంతా ఏవో రాస్తారు..నేను న‌వ్వుతాను అస‌లీ క‌విత్వం వొద్ద‌ని అంటే ఆమె ఎందుకనో ఫీల‌యిపోయారు.. మ‌నిషిలో లేని నిరీక్ష‌ణ మ‌న‌స్సులో లేని భావ‌న ఈ త‌ప్ప‌క చ‌ద‌వండి అన్న‌మాట‌లు సంతృప్తం చేస్తాయని అనుకోను..అస‌లు
ఈ ద‌రిద్ర‌గొట్టు క‌వులు రాయ‌కుండా ఉండ‌లేం అంటారేంటి.. రాయ‌కుండా ఉంటే అదేమ‌యినా పాప‌మా! స్త్రీ బ‌హిష్టు ఆపేసింనంత పాప‌మా! లేక  బ‌హిష్టు కాలాన్ని అర్థం చేసుకోలేనంత పాప‌మా! తెలియ‌దు.. రాయ‌కుండా ఉండ‌డంలోనే క‌దా అంతా ఉంది. ఈపాటి తెల్వ‌ని నా కొడుకులు సాహిత్యం రాస్తామ‌ని బ‌య‌లుదేరుతారేంటో!

ఇక్క‌డ  ఏమీ రాయ‌డం చేత‌గానోళ్లే..గొప్ప క‌వులు..స్త్రీని దేహాన్ని వేరువేరుగా చూసి రాత్రి ర‌తి కాల వాంఛ‌లు వెల్ల‌డి చేయ‌డమే ఇప్ప‌టి సాహిత్యంలా ఉంది. ఒకచోట ఆగిపోయాను. రాత రాని వారెంద‌రో మీడియాలో ఉన్నారు..సాహిత్యంలోనూ ఉన్నారు.. ఎవ్వ‌డ‌యినా రాయొచ్చా..ఎందుకు రాయాలి.. పెద్ద పెద్ద ప‌త్రిక‌లకే రాత చేత‌గావ‌డం లేదు..ఈ కాలాన రాయాల్సింది ప్రేమ‌ను పెంచే మాట.. ఔదార్యాన్ని పెంచే మాట..స‌ర్వ కాలాల‌కూ వ‌ర్తితం అయ్యే మాట ఎవ్వ‌ర‌యినా చెబుతున్నారా..?

స్త్రీ అయినా, అక్ష‌రం అయినా ఏమ‌యినా..ఎక్క‌డ‌యినా అనేకంలో ఒక్క‌టిగా ఉందో లేదో వెత‌కాలి..ఏకఃపురుషః అంటున్నాను క‌దా! అది కావాలి..మ‌న ద‌గ్గ‌ర ద‌రిద్ర‌గొట్టు స‌మాజంలో అంట్లు తోమ‌డం కూడా ఓ పెద్ద ప‌నిగా మారిపోయింది..మ‌ళ్లీ ఇప్పుడు త‌న ద‌గ్గ‌ర‌కు పోతాను..త‌న దేహాన్ని పొంది మ‌రికొన్ని మాటలు రాస్తాను..దేహాన్ని పొందడం అన్న‌ది కాంక్ష పూరితం ఇచ్ఛాపూరితం..స్వేచ్ఛా పూరితం కూడా! రాయ‌డం అంటే ఒళ్లు క‌ళ్లూ ఇంకా కొన్ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని రాయ‌డం.. గుడ్ల‌ప్ప‌గించి  దేహాల వ‌ర్ణ‌న‌ల‌ను చేయ‌డం కాదు.. ఇక్క‌డ ద‌రిద్ర‌గొట్టు మేథావులు చాలా మంది ఏవేవో రాస్తారు న‌వ్వుతాను..వారంతా ఏవేవో చెబుతుంటారు..న‌వ్వుతుంటాను. నిర్థిష్ట‌త‌కు తూగ‌ని మాట‌లు విని ఆమెకు చెప్పి న‌వ్వుకుంటాను.. ప్రేమ అన్న‌ది ఒక ప‌రివ్యాప్తి అయిన‌ప్పుడు రాత‌లోనూ, సంబంధిత చేత‌లోనూ, అనువ‌ర్తిత గుణంలోనూ అది ప‌రిపూర్ణం అవుతుంది..ప్రేమ అప‌రిప‌క్వం అయితే కోరిక ప‌రిపక్వత‌ల‌కు సంకేతం ఎలా అవుతుంది..శృంగారం,ప్రేమ రెండూ ఒక్క‌టే కావొచ్చు..వెల్ల‌డిలో ప్రేమ, వెల్ల‌డించ‌ని వ‌ర‌కూ కోరిక వీటి గుణ నిష్ప‌త్తుల‌ను ఆరాధ‌న‌గా చూశాను.

త‌న ద‌గ్గర‌కు పోయి క్ష‌మాప‌ణ‌లు అడిగాను..ఈ గ‌డ్డుకాలం పోయాక క‌లిసేది నిన్నే బోలెడు మాట‌లు చెబుతాను..అయినా మాట‌లు..మౌనాలు..వీటి చెంత రాత్రిళ్ల‌ను క‌రిగించి కాలాల‌ను అర్థం చేసుకోవ‌డం అన్న త‌ప్పే ఈ శృంగారం చేయిస్తోంది..లేదు అలాంటి దౌర్భాగ్యాల‌ను ఈ కాలం  అందించిపోతోంది..కోరిక‌కు అనువాద రూపాలు ఏమ‌యినా ఉన్నాయా ఉంటే అది శృంగారమే కావొచ్చు..స్త్రీ ద‌గ్గ‌ర కోరిక‌లు చెల్లుబాటు కావ‌డంలోనే మ‌గాడి గెలుపు ఉంద‌న్న చోటు  నేను లేను..ఈ వైర‌స్స‌లు ఉంటుండ‌గానే గ‌ర్బ‌స్రావాల రేటు పెరిగిపోతోంది.. అంటే ఎదురుగా ఉన్న‌ది వాంఛ‌ల‌కు విలువ ఇచ్చేంతగా ఉన్న‌ది ఆమె మాత్ర‌మే.. మీకు.. ఆ క‌ష్టం ఆ ఇబ్బంది నుంచి ఆమె బ‌య‌ట ప‌డ‌డం సులువు కాదు.. అయినా మీ మీ కోరిక‌ల‌ను ఈ కాలం ర‌ద్దు చేయ‌దు..

అందం అన్న అబ‌ద్ధం నుంచి ప్రేమ అను అబ‌ద్ధం వ‌ర‌కూ అమ్మాయిలు బాగుంటారు..అమ్మాయిలు బాగున్నారు అనుకునే తీరులోనే లోకం ఓడిపోతుంది..లోకంలో ఎన్ని నిజాలు చెలామ‌ణీలో లేకుంటే అంత బాగుంటుంది.. ప్రేమ‌లో వాంఛ‌లో విరిగి పెరిగిన నీడ‌లే శృంగార కేళీ విలాపాల‌కు సంకేతాలుగా నిలుస్తాయి. ప్రియ‌మ‌యినా,అప్రియ‌మ‌యినా వాంఛాతీత సంద‌ర్భాల‌కు ఈ వేళ వంద‌నాలు చెల్లిస్తూ..

 

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి