Hair Oiling Mistakes : జుట్టుకు ఆయిల్‌ రాసేప్పుడు ఈ తప్పులు మీరూ చేస్తున్నారా..?

-

జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. మెయింటేనెన్స్‌ కరెక్టుగా ఉండాలి. మీరు ఎంత పోషకాహారం తిన్నా, ఖరీదైన ఆయిల్స్‌, షాంపూలూ వాడినా సరే.. మెయింటేనెన్స్‌ అనేది కరెక్టుగా లేకపోతే.. మీ జుట్టుకు ఎప్పటికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. జుట్టు సంరక్షణ కోసం ఆయిల్‌ రాసుకోవడం అనేది చాలా ముఖ్యం. హెయిర్‌కు ఆయిల్‌ రాసి మసాజ్‌ చేయడం వల్ల స్కల్‌కు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అప్పుడు జుట్టు పొడిబారడం, రాలడం లాంటి సమస్యలన్నీ పోతాయి. అయితే చాలా మంది జట్టుకు ఆయిల్‌ రాసేప్పుడు తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారు. జుట్టుకు ఆయిల్‌ రాసి రోజుల తరబడి ఉంచుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఈరోజు జుట్టుక ఆయిల్‌ రాసుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం చేసే కామన్‌ మిస్టేక్ట్స్‌ ఏంటో తెలుసుకుందాం.

జుట్టుకు నూనె రాసుకుని రోజుల త‌ర‌బ‌డి అలాగే ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఫంగ‌ల్ ఇన్పెక్ష‌న్‌లు వ‌స్తాయి. ఇంకొంతమంది రాత్రి ప‌డుకునే ముందు జుట్టుకు నూనె రాసుకుంటారు. అసలు ఇది చాలా చెడ్డ అలవాటు. రాత్రి ఆయిల్‌ రాసుకోని ఉదయం తలస్నానం చేయొచ్చులే అనుకుంటారు. కానీ ఇలా రాత్రుళ్లు ఆయిల్ రాసుకోవడం వల్ల..త‌ల‌లో, నుదుటి మీద‌, క‌నుబొమ్మ‌ల మీద‌, చెవుల వెనుక భాగంలో మచ్చ‌లు వ‌స్తాయి. నుదిటి మీద చిన్న చిన్న పింపుల్స్‌ కూడా వస్తుంటాయి.

జుట్టుకు ఎక్కువ కాలం పాటు నూనెను ఉంచుకోవ‌డం వ‌ల్ల ముఖంపై న‌ల్ల‌టి మ‌చ్చ‌లు కూడా వ‌స్తాయి. జుట్టుకు నూనె రాసుకోవ‌డం మంచిదే అయిన‌ప్ప‌టికి నూనెను రాత్రంతా ఉంచుకోకూడ‌దు. రోజుల త‌ర‌బ‌డి జుట్టుకు ఆయిల్‌ అస్సలు ఉంచుకోకూడదు. త‌ల‌స్నానం చేయ‌డానికి అర‌గంట ముందు నూనె రాసుకుని మ‌ర్దనా చేయాలి. చాలా మంది జుట్టుకు నూనె రాసి గ‌ట్టిగా రుద్దుతారు. ఇలా చేయ‌డం వల్ల జుట్టు మృదుత్వాన్ని కోల్పోవ‌డంతో పాటు జుట్టు చిట్ల‌డం, జుట్టు రాల‌డం వంటివి కూడా జ‌రుగుతాయి. జుట్టుకు నూనె రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. హెయిర్‌కుఆయిల్‌ పెట్టడం కూడా ఒక ఆర్ట్‌.. చక్కగా జుట్టును రెండు భాగాలుగా చేసి.. ఆయిల్‌ పెట్టుకోని.. వేళ్లతో తలలో మసాజ్‌ చేసుకోవాలి. సున్నితంగా ఆయిల్‌ రాయాలి. ఈ విధంగా జుట్టుకు నూనెను రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా, ఎటువంటి జుట్టు స‌మ‌స్య‌లు లేకుండా ఉంటాయ‌ని సౌందర్య నిపుణులు చెబుతున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version