పాల ఉత్పత్తులు చర్మానికి అసలు మంచివి కావంటున్న అధ్యయనాలు..

-

పాలు, పాలతో చేసిన పదార్థాలు చర్మానికి మేలు చేస్తాయని మనం ఇన్నిరోజులు చాలా బలంగా నమ్మాం.. పైగా..నాచురల్గా పాలతో చేసిన ప్రొడెక్ట్స్‌ కూడా వాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. గోట్ మిల్క్‌ సోప్‌ అని చాలామంది ఈ మధ్య అదే వాడుతున్నారు. స్కిన్‌ వైట్‌ వస్తుందని..ఇంట్లో కూడా పాలతో, పాల మీగడతో ఏవేవో ఫేస్‌ ప్యాక్స్‌ వేసుకుంటాం కదా..కానీ మీ అందరికి ఓ షాకింగ్ విషయం ఏంటంటే..పాల ఉత్పత్తులు చర్మ ఆరోగ్యానికి మంచివి కావని తాజా అధ్యయానాల్లో తేలింది. వీటి వల్ల తామర, మొటిమలు, చర్మం నిస్తేజంగా మారడం అనేది పాల ఉత్పత్తుల వల్లే జరుగుతుందని అంటున్నారు. మొటిమలు రావడంలో పాల ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ఇన్సులిన్ స్థాయిలో పెరుగుదల

ప్రాసెస్ చేసిన ఆహారాలు లేదా చక్కెర వంటి పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలకి అంతరాయం కలిగించి హార్మోన్లలో అసమతుల్యతకి కారణం అవుతుంది. మనం తీసుకునే డెయిరీ ప్రొడక్ట్స్ ఇన్సులిన్‌తో సమానమైన ప్రోటీన్లతో కలిసిపోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలో పెరుగుదల జరుగుతుంది. ఇన్సులిన్ పెరుగుదల శరీరాన్ని ఇన్ఫెక్షన్స్‌కి గురి చేస్తుంది. మొటిమలు, తామర, రొసెసియా వంటి పరిస్థితులకి కారణం అవుతుంది. అకాంథోసిస్ నైగ్రికన్స్, అమిలోయిడోసిస్, పిగ్మెంటేషన్, చర్మం పొడి బారడం వంటి చర్మ సమస్యలకి దారి తీస్తుంది. కొల్లాజెన్ తగ్గించి వృద్ధాప్య సంకేతాలు వచ్చేలా చేస్తుందట.. ఓరినాయనా ఇంత డెంజరా..!

హార్మోన్ల గ్రోత్‌పై ఎఫెక్ట్..

ఆవు పాలు, పాల ఉత్పత్తుల్లో కేసైన్ వంటి ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్-1(IGF-1), ప్రొలాక్టిన్, ప్రోస్టాగ్లాండిన్స్, స్టెరాయిడ్స్ వంటి కొన్ని హార్మోన్ల స్థాయిలను పెంచుతాయి. పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు తరచుగా వాటికి రీకాంబినెంట్ బోవిన్ గ్రోత్ హార్మోన్ అనే సింథటిక్ హార్మోన్‌తో వైద్యం చేస్తారు. ఈ హార్మోన్లలో మరీ ముఖ్యంగా IGF-1 సెబమ్తో ముడిపడి ఉంటుంది. ఇది చర్మంలోని నూనె వచ్చేలా చేయడంతో పాటు రంధ్రాలని అడ్డుకుంటుంది. మొటిమలని వచ్చేలా చేస్తుందట.

పాల ఉత్పత్తుల వల్ల అనార్థాలు..

డెయిరీ ప్రొడక్ట్స్‌లో లాక్టోస్ అనేది సహజంగా లభించే చక్కెర. శరీరంలోని షుగర్‌ని విచ్చిన్నం చేయడానికి లాక్టోస్ అనే ఎంజైమ్ ఉపయోగిస్తారు. అయితే ప్రతి ఒక్కరికీ వచ్చే చర్మ సమస్యలు పాల ఉత్పత్తుల వల్ల వచ్చే అవకాశం లేదు. అయితే ఆ సమస్యలను ఈ పాల ఉత్పత్తులు ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఒత్తిడి, హార్మోన్లు, నిద్ర, కాలుష్యం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు కూడా చర్మానికి విపరీతమైన హాని కలిగిస్తాయి.

అన్ని రకాలు చెడ్డవి కావు..

అన్ని రకాల పాల ఉత్పత్తులు చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవు. కెఫీన్, పెరుగు, చీజ్, పులియబెట్టిన పాల ఉత్పత్తులు గుండె, ఎముకల ఆరోగ్యానికి హాని చేస్తాయి. అంతే కాదు జీర్ణక్రియ, బరువు విషయంలో కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే పాల ఉత్పత్తులు మితంగా, సమతుల్యంగా మాత్రమే వాడాలి.. ఇక ముఖానికి పాల ఉత్పత్తులు వాడేముందు ఓసారి ఆలోచించండి.

Read more RELATED
Recommended to you

Latest news