బిజినెస్ ఐడియా: ఈ పంట వేస్తే రైతులకు మంచి బెనిఫిట్స్..లక్షల్లో ఆదాయం..

-

రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలను వేసిన కూడా కొన్ని సార్లు వాతావరణ పరిస్థితుల వల్ల నష్టాలు వస్తాయి..అయినా వ్యవసాయాన్ని మాత్రం వదలడు.రైతులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేస్తున్నారు.అలాంటి వారి కోసం మంచి బిజినెస్ ఐడియా ఉంది.. బ్లాక్ రైస్ ను పండించడం.. మార్కెట్లో మంచి రేటు పలుకుతోంది. ఈ పంటను పండిస్తే.. మీకు భారీగా లాభాలు వచ్చే అవకాశముంది..

 

సాధారణ బియ్యంతో పోల్చితే నల్ల బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే డయాబెటిస్, బీపీ వ్యాధులపై ప్రభావంతంగా పనిచేస్తోంది. ఈ బియ్యం తింటే షుగర్, బీపీ వంటి రోగాలు అదుపులో ఉంటున్నాయి. అందుకే కాస్త ధర ఎక్కువైనా.. చాలా మంది బ్లాక్ రైస్ తినేందుకు ఇష్టపడుతున్నారు. మొదట చైనాలో ఈ రకం బియ్యాన్ని ఎక్కువగా పండించారు. ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉండడంతో ఇతర ప్రాంతాలకు విస్తరించింది.

మనదేశంలో నల్ల బియ్యం సాగు ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మణిపూర్, అసోంలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా కొందరు రైతులు బ్లాక్ రైస్ పండిస్తున్నారు. బియ్యంగా ఉన్నప్పుడు ఇవి నల్లగా కనిపించినా.. వండిన తర్వాత అన్నం నీలం, ఉదా రంగులోకి మారుతుంది. అందుకే ఉత్తరాదిన నీలా భాట్ అని కూడా పిలుస్తారు..ఈ పంట నారు నుంచి కోత వరకు 120 రోజుల సమయం పడుతుంది..

కంకులు కూడా పెద్దగా ఉంటాయి. సంప్రదాయ బియ్యం కంటే.. నల్ల బియ్యంతో 5 రెట్లు అధిక ఆదాయం పొందవచ్చు. సాధారణ బియ్యం ధర మార్కెట్లో కిలోకు 50-100 వరకు ఉంటుంది. అదే నల్ల బియ్యం రేటు రూ.250-500 వరకు పలుకుతుంది. నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. సేంద్రీయ పద్దతిలో నల్ల వరి పంటను సాగు చేస్తే.. అధికంగా రేటు వస్తుంది. SMAM యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు కూడా అందుతాయి. ఈ పథకం కింద 50 నుంచి 80 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు, యంత్రాలను పొందవచ్చు..మీరే సొంతంగా మార్కెట్ చేస్తే లక్షలను పొందవచ్చు..ఈ బియ్యం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్ల ఎక్కువ మంది వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.. మీరే ఆలోచించండి..

Read more RELATED
Recommended to you

Latest news