ట్రెండ్ ఇన్: ‘ఆచార్య’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..అంచనాలను మించి చిరంజీవి-రామ్ చరణ్ సినిమా!

-

సూపర్ స్టార్ డమ్ ఉన్న తండ్రీ తనయులు ఇంత వరకు ఒకే టైంలో సినిమా చేయలేదు. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నారా? ఆ ఊహాలకు రూపమే ‘ఆచార్య’. చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

తండ్రీ తనయులు ఒకేసారి వెండితెర మీద చూసేందుకు సినీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఎప్పుడెప్పుడు టాకీసుకు వెళ్దామా? అని అనుకుంటున్నారు. బ్యూటిఫుల్ స్టోరితో సినిమా తెరకెక్కిందన్న సంగతి ఇటీవల ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు. ఇక ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని మెగా అభిమానులు సంబురాలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ షురూ చేశారు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో #Acharya హ్యాష్ ట్యాగ్ ఆచార్య అంటూ చిరంజీవి – రామ్ చరణ్ ల ఫొటోలను, ఆచార్య సినిమా పోస్టర్ లను ట్వీట్ చేశారు. అలా వరుస ట్వీట్స్ ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

ఈ నెల 23న ‘ఆచార్య’ పిక్చర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయమై మేకర్స్ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. చూడాలి మరి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారో..

Read more RELATED
Recommended to you

Latest news