Sree Vishnu: ‘భళా తందనాన’ అంటున్న శ్రీవిష్ణు..యంగ్ హీరో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు..ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు వైవిధ్యం ఉన్న స్టోరిలు ఎంచుకుని సినిమాలు చేస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. సరైన సక్సెస్ కోసం యంగ్ హీరో వెయిట్ చేస్తున్నారు.


ఈ క్రమంలోనే శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ పైన హోప్స్ పెట్టుకున్నాడు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సినిమా ‘భళా తందనాన’. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ పిక్చర్ లో హీరోయిన్ కేథరిన్ కాగా, పిక్చర్ కు స్టోరి శ్రీకాంత్ విస్సా అందించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ ఇచ్చారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ వినూత్నంగా ఉండటంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, మ్యూజిక్ కూడా డిఫరెంట్ గా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు. శుక్రవారం ఈ చిత్ర రిలీజ్ డేట్ మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ నెల 30న పిక్చర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందులో విలన్ గా KGF ఫేమ్ రామచంద్రరాజు నటించారు. ఈ చిత్రంలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి..ఏమవుతుందో..ఈ చిత్రంతో శ్రీ విష్ణు ఘన విజయం అందుకుంటారో లేదో..

Read more RELATED
Recommended to you

Latest news