మెగాస్టార్ ఇంట సంగీత కచేరీ.. కీరవాణికి ‘విశ్వంభర’ సర్ప్రైజ్

-

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. దాదాపుగా ప్రతి విషయంపై ఆయన నెట్టింట స్పందిస్తుంటారు. ఆత్మీయులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతుంటారు. తాజాగా ఆయన ఆస్కార్ అవార్డ్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చారు. తనకు పాత రోజులు గుర్తొచ్చాయంటూ ఓ వీడియో షేర్ చేసి కీరవాణీ బర్త్డే స్పెషల్ అంటూ ఆయనకు విషెస్ చెప్పారు.

“గతంలో సినిమాలకు పాటలు కంపోజ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అందరూ మూవీ టీమ్ కూర్చొని పాటల గురించి చర్చించుకుని ఫైనల్ చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. విశ్వంభర సినిమాతో మళ్ళీ ఆ ఆనవాయితీ తీసుకొచ్చారు. మా ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన టీమ్తో కలిసి విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు.” అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్లో చిరుతో పాటు డైరెక్టర్ వశిష్ఠ, మిగతా మూవీటీమ్ పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హ్యాపీ బర్త్ డే కీరవాణి అంటూ నెట్టింట అభిమానులు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version