ఆహా ప్లాన్ బెడిసి కొట్టిందా.. నష్టాల బాట పయనం..!

-

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా భారీ స్థాయిలో ఆదరణ పొందడానికి కారణం బాలయ్య నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్.. మొదటి సీజన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. దీంతో రెండవ సీజన్ కూడా మొదలుపెట్టారు నిర్వాహకులు. అయితే కొందరి వల్ల ఆహా తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ ను అసలు ఆహా పెద్దగా ఉపయోగించుకోలేకపోయిందనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళితే అభిమానుల కోరిక మేరకు ఈ ఎపిసోడ్ ను ముందుగానే స్ట్రీమింగ్ అయ్యేలా చేశారు. 31వ తేదీన స్ట్రీమింగ్ కావాల్సిన ఎపిసోడ్ 30వ తేదీన స్ట్రీమింగ్ అయింది.

అయితే ఆహా సబ్స్క్రైబ్ కోసం గతరాత్రి చాలామంది పోటీపడ్డారు . ప్రభాస్ ఎపిసోడ్ ప్రీమియర్స్ వీక్షించేందుకు జనాలు అందరూ ఒకేసారి ఆహా యాప్ ను ఓపెన్ చేయడంతో సర్వర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. కొన్ని గంటల వరకు ఆహా పని చేయని విధంగా క్రాష్ అయిపోయింది. 9 గంటలకు స్ట్రీమింగ్ కావాల్సిన ఎపిసోడ్ను కొంతమంది అయితే 12 గంటల తర్వాత కూడా చూడని పరిస్థితి ఏర్పడింది. దీంతో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారి కంటే తీసుకోని వారే ముందుగా ఎపిసోడ్ ను ఎక్కువ స్థాయిలో వీక్షించినట్లు తెలుస్తోంది.

కారణం అప్పటికే మేటర్ మొత్తం సోషల్ మీడియాలో లీక్ కావడంతో జనాలు పైరసీ వెబ్సైట్స్ నుంచి ఆహా ఎపిసోడ్లో ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టేశారు ఇక సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో మళ్ళీ ఆహా వైపు ఎవరు కూడా తిరిగి చూడలేదు. దీంతో ఆహా కొంత వరకు నష్టాల బారిన పడిందని చెప్పాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో షో లకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ టెక్నికల్ టీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎప్పటిలానే పని కొనసాగించింది. దీంతో ఒక్కసారిగా లిమిట్ కంటే ఎక్కువ స్థాయిలో జనాలు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి రావడంతో ఆహా బ్యాలెన్స్ చేయలేక క్రాష్ అయిపోయింది. అలా మొత్తానికైతే నష్టాల బాట పట్టింది ఆహా.

Read more RELATED
Recommended to you

Exit mobile version