రెబల్ స్టార్ ప్రభాస్ తో మరోసారి అనుష్క రొమాన్స్..!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అంద చందాలు మరియు నటనతో కూడా ఆకట్టుకుంటోంది ఈ అందాల తార. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుష్క.. అప్పటి నుంచి తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. తరువాత టాలీవుడ్‌ లోనే నంబర్‌ వన్‌ గా ఎదిగింది.

అటు బాహుబలి సినిమాలో ప్రభాస్‌ సరసన అనుష్క నటించి… అందరినీ ఆకట్టుకుంది. అయితే.. వీరిద్దరి కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుందట. త్వరలోనే మారుతి-ప్రభాస్‌ కాంబోలో ఓ సినిమా రాబోతుంది.

ఈ సినిమాకు రాజా-డిలాక్స్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఇందులో.. ప్రభాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారు. అందులో కృతి శెట్టి, పెళ్లి సందడి ఫేం శ్రీ లేఖ నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు రాగా..మూడో హీరోయిన్‌ గా అనుష్క నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌ పై ఇప్పటికే అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.