టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాకు వేదం, కంచె చిత్రాల దర్శకుడు జాగర్లమూడి కృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
ఈ మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను వదిలింది. పోస్టర్ లో అనుష్క కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 18, 2025న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుందని యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. అనుష్క ట్రైబల్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.