సైరా కోసం ఏపీ మంత్రి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా…!

-

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా సినిమా మ‌రి కొద్ది గంటల్లోనే థియేట‌ర్లోకి రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలో ఎక్క‌డ చూసినా సైరా హ‌డావిడి ఓ రేంజులో ఉంది. ఏపీలో చిరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏపీలో సాహో లాంటి సినిమాల‌కు కూడా అద‌న‌పు షోల‌కు అనుమ‌తులు ఇచ్చారు. కానీ సైరా విష‌యంలో మాత్రం ఇందుకు పూర్తి రివ‌ర్స్‌గా వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. ఏపీలో అద‌న‌పు ఆట‌లకు ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ప్ర‌భుత్వం నుంచి ప‌ర్మిష‌న్లు లేవు.
అదనపు ఆటల ప్రయత్నం జరుగుతోందా? లేదా? అన్న విషయమై యూనిట్ వైపు నుంచి కూడా సరైన క్లారిటీలేదు.

ఈ సినిమా వైసీపీపై ప్ర‌తి రోజు విమ‌ర్శ‌లు చేస్తోన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యామిలీకి చెందింది. ప‌వ‌న్ ప్ర‌తి నిత్యం జ‌గ‌న్‌, వైసీపీపై ఎలా విరుచుకు ప‌డుతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక సినిమా బడ్జెట్ దృష్ట్యా చిరంజీవి తనకు సన్నిహితుడైన మంత్రి కన్నబాబు ద్వారా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక మ‌రో నిర్మాత దిల్ రాజు సైతం త‌న స‌ర్కిల్స్‌లో రాయ‌భారాలు న‌డుపుతున్నాడ‌ట‌. ఇక సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ సిఎమ్ జగన్ దగ్గర వుండడం వల్ల ఎవ్వరూ జోక్యం చేసుకుంటారు? అన్నది పాయింట్.

సోమ‌వారం కూడా ప‌వ‌న్ ర‌క‌ర‌కాల ఘాటు ట్విట్ల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. దీంతో సైరా అద‌న‌పు షోల‌కు ప‌ర్మిష‌న్లు వ‌స్తాయా ? అన్న‌ది డౌటే. మొత్తంమీద అదనపు ఆటలు రాకపోతే మాత్రం సైరా బయ్యర్లకు కాస్త కష్టం తప్పదని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాను కోట్లాది రూపాయ‌లు పోసి కొన్న బ‌య్య‌ర్ల‌కు అద‌న‌పు షోలు ఉంటే సెల‌వుల్లో మంచి క‌లెక్ష‌న్లు వ‌చ్చి వాళ్లంతా సేవ్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news