కమలా హారిస్ కు ఏ.ఆర్.రెహమాన్ మద్దతు

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు మద్దతుగా భారత ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ రంగంలోకి దిగారు. హారిస్ కు మద్దతుగా 30 నిమిషాల ప్రదర్శన వీడియోను ఆయన రికార్డు చేశారు. హారిస్ కు మద్దతుగా ప్రచారం చేయనున్న తొలి దక్షిణాసియా కళాకారుడిగా నిలిచారు. ఏ.ఆర్. రెహ్మాన్ మద్దుతుతో నవంబర్ 05న అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో హారిస్ గెలుపు అవకాశాలు మరింత మెరుగు అవుతాయని భావిస్తున్నారు.

అమెరికా పురోగతి కోసం ఇప్పటికే నిలబడిన నాయకులు, కళాకారుల బృందానికి ఈ ప్రదర్శన ద్వారా రెహ్మాన్ తన స్వరాన్ని కలిపినట్టు అయిందని ఆసియా అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్ పర్సన్ శేఖర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. రెహ్మన్ సంగీత కార్యక్రమమే కాదు.. మనం చూడాలనుకుంటున్న అమెరికా కోసం మన సమూహాలు ఓటు వేయాలని పిలుపునిస్తున్నట్టు తెలిపారు నరసింహన్. రెహ్మాన్ రూపొందించిన 3 నిమిషాల వీడియోను అక్టోబర్ 13న ఆదివారం విడుదల చేయనున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version