నాని సినిమాకి భారీగా డిమాండ్ చేస్తున్న ఏఆర్ రెహమాన్.. ఒప్పుకుంటారా..?

-

ప్రస్తుత కాలంలో ఒక సినిమా హిట్ కొట్టాలి అంటే మంచి కథ, డైరెక్షన్ తో పాటు మ్యూజిక్ కూడా బాగుండాలి. ఇలా అన్ని విషయాలు ప్రేక్షకులకు నచ్చితేనే సినిమాని హిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కి డిమాండ్ పెరుగుతున్నట్లే మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోతుంది. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాకు మ్యూజిక్ అందించడం మరో ఎత్తు అన్నట్టు మారింది. మ్యూజిక్ అందించడమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు పాటలకు బాగా మ్యూజిక్ అందించాలి. అప్పుడే వర్క్ అవుతుంది. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈమధ్య బాగా డిమాండ్ చేస్తున్నారు.

మరి ఆ డిమాండ్ ఎలా ఉందంటే హీరోయిన్ల రేంజ్ లో కోట్లు డిమాండ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నా.. వారిలో ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆయన మ్యూజిక్ కి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా వస్తుందంటే.. తప్పకుండా ఆ సినిమా మ్యూజికల్ హిట్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ను సెలెక్ట్ చేసుకున్నారట.

అయితే ఏ ఆర్ రెహమాన్ మాత్రం ఆ సినిమాకు పని చేయడానికి ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం . అయితే ఒక మ్యూజిక్ కి రూ.10 కోట్లు అంటే ఏం చేయాలో నిర్మాత డివివి దానయ్యకు పోలుపోలేదట. వాస్తవానికి ఈ సినిమా నిర్మాతగా ఆయనే పనిచేస్తున్నారు. ఏది ఏమైనా రూ.10 కోట్లు డిమాండ్ చేయడం ఎక్కువే అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది .మరి కొంత మంది ఏఆర్ రెహమాన్ రేంజ్ అటువంటిది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version