ప‌వ‌న్ క‌ళ్యాణ్ , శ్రీజ ల‌కు చెరి నాలుగు పెళ్ళిళ్ళు ప‌క్కా.. వేణు స్వామి

-

మెగా కుటుంబంలో ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి విమ‌ర్శ‌లే విమ‌ర్శ‌లు.. ఇక‌ చిరు చిన్న కూతురు శ్రీజ త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకోబోతుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. మొన్నామ‌ద్య నిహారిక ప‌బ్ ఇష్యూ, సాయి ధ‌ర‌మ్ తేజ్ బైక్ యాక్సిడెంట్.. ఇవ‌న్నీ స‌రిపోవు అన్న‌ట్లుగా ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన విష‌యం సంచ‌ల‌నంగా మార‌బోతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, శ్రీజ‌ల‌కు నాలుగు పెళ్ళిళ్ళు అవుతాయ‌ని చెప్పి బాంబు పేల్చాడు.

నాగ చైత‌న్య స‌మంత‌ల విడాకుల గురించి ఈయ‌న ముందుగానే యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. నిజంగా ఆయ‌న చెప్పిన‌ట్లే జ‌రిగింది. గ‌తంలో న‌రేష్‌, ర‌మ్య ర‌ఘుప‌తిల జాత‌కాలు క‌ల‌వ‌వు వీరు విడిపోతార‌ని హీరో కృష్ణ‌తో ముందే చెప్పాన‌ట్లు ఈ మ‌ద్య ఓ ఛానెల్‌తో పంచుకున్నాడు. మరి ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో పెళ్ళి అంటే అది రాజ‌కీయంగా ఆయ‌న‌కు పెద్ద మైన‌స్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

ఇక చిరంజీవి గారాల కూతురు శ్రీజ జాత‌కం కూడా ప‌వ‌న్‌లానే ఉండ‌బోతుంద‌ని, ఆమెకు నాలుగో పెళ్ళి జాత‌కంలో ఉందంటూ మ‌రో బాంబు పెల్చాడు వేణు స్వామి. నాలుగో పెళ్ళి వీరిద్ద‌రి జాతకంలో ఉన్నాయ‌ని, అప్ప‌టి వ‌ర‌కు వీరి వివాహ జీవితం నిల‌క‌డ‌గా ఉండ‌ద‌ని చెప్పుకొచ్చాడు. శ్రీజ మూడో పెళ్ళి చేసుకోబోతుందని, గురువు నీచంలో ఉడ‌టం వ‌ల్ల మూడు నుండి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయ‌ని వివ‌రించారు. పెళ్ళి అనేది ప‌ర్స‌న‌ల్ విష‌య‌మంటూ చెప్పాడు.

వేణు స్వామిపై మెగా అభిమానులు ఇంత ఎత్తున లేస్తున్నారు. తాగుబోతు జ్యోతిష్యుడంటూ, వేణు స్వామికి ఎంత‌మంది భార్య‌లంటూ మండి ప‌డుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని రాజ‌కీయంగా దిగ‌జార్చేందుకే వేణు స్వామి డ‌బ్బులు తీసుకొని ఇలా చెబుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news