బాలయ్య వద్దన్న కథతో బ్లాక్ బాస్టర్ అందుకున్న మోహన్ బాబు.. ఆ సినిమా ఇదే..!

-

సాధారణంగా ఒకసారి వేరే ఏదైనా భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం సేఫ్ అని కొందరు హీరోలు అనుకుంటుంటారు. అందులో ఆ భాష నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి జాగ్రత్త వహిస్తుంటారు కూడా. కాగా, అలా రీమేక్ చేయడం ఇష్టం లేని హీరోలు కూడా చాలా మందే ఉన్నారు. అలా రీమేక్ కోసం వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ స్టోరిని నందమూరి నటసింహం బాలయ్య రిజెక్ట్ చేశారు. దాంతో అదే కథ మోహన్ బాబు వద్దకు వెళ్లగా, దానిని ప్రొడ్యూస్ చేయడమే కాదు, అందులో హీరోగా నటించి ఘన విజయం అందుకున్నాడు కలెక్షన్ కింగ్. ఆ చిత్రం ‘అల్లుడు గారు’.

మాలీవుడ్(మలయాళం) కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలయాళ పిక్చర్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సీనియర్ హీరోయిన్ సుహాసిని తీసుకుంది. అలా ఈ కథ తొలుత బాలయ్య వద్దకు వచ్చింది. అది విన్నాక బాలయ్య నో చెప్పాడు. దాంతో స్టోరి మోహన్ బాబు వద్దకు వెళ్లింది.

వరుస ఫ్లాపులతో మోహన్ బాబు సతమతమవుతున్న టైమ్ లో మోహన్ బాబును ఈ పిక్చర్ నిలబెట్టింది. ఈ సినిమాను శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు ప్రొడ్యూస్ చేయగా, తెలుగులో ఘన విజయం సాధించింది. శోభన, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించగా, కీలక పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు.

ఇక ఇందులో చంద్రమోహన్, మోహన్ బాబుల మధ్య కామెడీ సీన్స్ చాలా హైలైట్ అయ్యాయి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ కూడా వెండితెరపైన స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా సాంగ్స్ మేకింగ్ లో ఆయన మార్క్ ఆడియన్స్ ఈజీగా గుర్తు పట్టేయవచ్చు. అలా ఈ చిత్ర కథను బాలయ్య వద్దనడంతో మోహన్ బాబుకు సూపర్ హిట్ పిక్చర్ వచ్చింది. ఈ మూవీని రీమేక్ చేయాల్సి వస్తే విష్ణు చేస్తే బాగుంటుందని ఓ కార్యక్రమంలో మోహన్ బాబు అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news