‘బిగ్ బాస్’ సీజన్ 6 స్టార్టింగ్ డేట్ ఫిక్స్.. కంటెస్టెంట్స్ వీళ్లే..!!

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. తాజాగా నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ క్రమంలోనే షో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే విషయమై సోషల్ మీడియాలో రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ సీజన్ కూ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునయే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

 

సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ఆగస్టు చివరి వారంలోనే షో స్టార్ట్ కావాల్సింది. కానీ, వన్ వీక్ పోస్ట్ పోన్ అయిందట. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4 సాయంత్రం 6 గంటలకు..బిగ్ బాస్ సీజన్ 6 స్టార్టింగ్ డేట్ లాక్ అయినట్లు సమాచారం. ఇక ఈ సీజన్ లో 15 మంది కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ చేశారట.

 

బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా యాంకర్ శివను ఫైనల్ చేసినట్లు వినికిడి. ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా శివ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ను చూసి శివను సెలక్ట్ చేసినట్లు సమాచారం. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకర్ ఉదయ భాను ను కూడా కంటెస్టెంట్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ యాంకర్ గా ప్రేక్షకులకు సుపరిచితమైన నేహా చౌదరి, ‘జబర్దస్త్’ షో నుంచి చలాకీ చంటి ని కంటెస్టెంట్స్ గా తీసుకున్నట్లు వినికిడి.

టీవీ 9 యాంకర్ ప్రత్యూష, ఆర్జే సూర్య , యూట్యూబర్ నిఖిల్, సోషల్ మీడియా ఫేమ్ శ్రీహాన్ (సిరి బాయ్ ఫ్రెండ్), గాయని మోహన భోగరాజ్, ఆర్టిస్ట్ నందు(సింగర్ గీతా మాధురి భర్త), యాంకర్ వర్షిణి, హీరో భరత్(చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు)తో పాటు యాంకర్ శ్రవంతి చొక్కారపు, ‘ఢీ’ ఫేమ్ కొరియోగ్రాఫర్ పప్పీ మాస్టర్, హీరోయిన్ సంజనా చౌదరి లను కంటెస్టెంట్స్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇంకో ముగ్గురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షోలో పంపించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం.