స్టైలిష్ లుక్ లో బన్నీ.. ఫోటోలు వైరల్

-

టాలీవుడ్ లో స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం “పుష్ప” మూవీ ఈ మధ్యకాలంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం సిద్ధమవుతున్నారు. ఆగస్టు చివరి వారంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ న్యూ లుక్ పుష్ప 2 కోసమా? పుష్ప 2 లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కానీ ఈ న్యూ లుక్ పుష్ప 2 కోసం కాదని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రకటన షూట్ చేస్తున్నట్లుగా మరి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అల్లు అర్జున్ మరో స్టైలిష్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news