ఆచార్య బయ్యర్లకు హామీ ఇచ్చిన చరణ్.. కష్టాలు తీరినట్టేనా..?

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి , ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది . సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే సొంతం చేసుకొని డిజాస్టర్ గా మిగలడం గమనార్హం. ఇకపోతే ఇటీవల కాలంలో అటు చిరంజీవి కానీ , ఇటు రామ్ చరణ్ కానీ నటించిన ఏ సినిమాలు కూడా ఇంత తక్కువ కలెక్షన్లు సాధించింది లేదు. మరోవైపు ఆచార్య సినిమా బయ్యర్లకు మాత్రం ఈ సినిమా ద్వారా ఏకంగా 70 శాతం నష్టాలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బయ్యర్లు ఏకంగా తమ కన్నీటితో చిరంజీవికి మొరపెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆచార్య సినిమా నష్టాల భర్తీ చేయడానికి రామ్ చరణ్ సైతం తన వంతు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ వేరువేరు రూపాలలో బయ్యర్లను ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చరణ్ డబ్బు రూపంలో కొంత మొత్తం వారికి వెనక్కి ఇవ్వనున్నట్లు సమాచారం. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్టుల హక్కులను, తన భవిష్యత్తు సినిమాల హక్కులను తక్కువ మొత్తానికి ఇస్తానని కొంతమంది బయ్యర్ల చరణ్ హామీ ఇచ్చారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొరటాల శివ కూడా బయ్యర్లకు ఎన్టీఆర్ మూవీ హక్కులను కొంతమేర తక్కువకే ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇకపోతే చరణ్, కొరటాల శివ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి కొద్ది రోజుల క్రితమే కేవలం పది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారని వార్తలు బయటకి వచ్చాయి . ఇక మొత్తానికి ఆచార్య బయ్యర్లకు నష్టాలు పూర్తి అవుతుండడంతో వాళ్లు కూడా సంతోషిస్తున్నారు. రామ్ చరణ్ , చిరంజీవి లాంటి వారు గొప్ప మనసుతో ఇలా బయ్యర్లను ఆదుకోవడం చాలా హర్షదాయకం అని చెప్పవచ్చు.