టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ ‘గ్యాంగ్ లీడర్’. అప్పట్లో ఈ సినిమా చూసి కుర్రకారు ఫిదా అయిపోయంది. మెగా మేనియా స్టార్ట్ అయి..ఆ పిక్చర్ లోని చిరు స్టెప్పులు చేసి ఉర్రూతలూగిపోయింది యూత్.
ప్రతీ సీన్ లో చిరంజీవి యాక్టింగ్ చూసి వావ్ అనుకున్నారు జనాలు. ఎమోషన్ ప్లస్ డ్యాన్స్ ప్లస్ కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ పిక్చర్ నిజానికి చిరంజీవి చేయాల్సిన మూవీ కాదట. తొలుత ఓ హీరో ఈ సినిమా చేయాలనుకున్నారు. ఆ తర్వాతనే ఈ కథ చిరు వద్దకు వచ్చింది. ఆ సంగతులేంటో తెలుసుకుందాం.
‘కొండవీటి దొంగ’ పిక్చర్ లో చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు నటన చూసి ఫిదా అయిన పరుచూరి బ్రదర్స్ ‘అరే ఓ సాంబ’ అనే టైటిల్ తో పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్నారు. అలా ఆ స్టోరితో మూవీ తీయానుకున్నారు. అయితే, కొత్త హీరో అయిన నాగబాబుతో పిక్చర్ చేయాలంటే ప్రొడ్యూసర్స్ భయపడ్డారు. దాంతో ఆ స్టోరిని తన సోదరుడు అయిన మెగాస్టార్ చిరంజీవికి వినిపించాలని పరుచూరి బ్రదర్స్ కు నాగబాబు సూచించారు. అలా ఆ స్టోరి చిరు వద్దకు వెళ్లింది.
అలా ఆ మూవీ స్టోరి చిరంజీవి వద్దకు రాగా మార్పులు చెప్పి స్టోరిలో కొన్ని చేంజెస్ చేశారు. దర్శకుడు బాపినీడుతో మాట్లాడి సినిమా టైటిల్ కూడా మార్చేశారు. అలా ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ తో దర్శకుడు బాపినీడు సినిమాన తెరకెక్కించి సూపర్ హిట్ పిక్చర్ ప్రేక్షకులకు ఇచ్చారు. ఒకవేళ నాగబాబుతో ఎవరైనా నిర్మాత సినిమా చేసే అవకాశం ఉంటే కనుక ‘గ్యాంగ్ లీడర్’ పిక్చర్ బయటకు వచ్చేది కాదని చెప్పొచ్చు.
మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ ఫిల్మ్ ను రీమేక్ చేయాలని పలువురు మేకర్స్ అనుకున్నారు. కానీ, అది సాధ్యపడటం లేదు. ఈ టైటిల్ తో నేచురల్ స్టార్ నాని ఒక సినిమా చేశారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ పిక్చర్ ను రీమేక్ చేస్తే చాలా బాగుటుందని మెగా అభిమానులు సూచిస్తున్నారు. చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ త్వరలో రిలీజ్ కానుంది. ఇది మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ అన్న సంగతి అందరికీ విదితమే.