రాజమౌళి డైరెక్షన్‌లో నటించాలనే కోరిక లేదు : చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్”. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు.ఈ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సత్యదేవ్, సునీల్, సముద్రఖని, కీలక పాత్రలలో నటించనున్నారు. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది.


ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు.. హిందీలోనూ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళిపై మెగాస్టార్‌ చిరంజీవి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి గొప్ప దర్శకుడని.. ఆయన అంటే తనకు ఇష్టమన్నారు. అయినా.. ఆయన డైరెక్షన్ లో యాక్టింగ్‌ చేయబోనని.. తెలిపారు. రాజమౌళి ప్రతి విషయాన్ని చాలా డిప్‌ గా చూస్తారని.. ఆయన కోరుకున్న ఔట్‌ పుట్‌ ను ఇవ్వగలనో లేదో తనకు తెలియదని వెల్లడించారు. ఆయన ఒక సినిమాతో మూడు నుంచి ఐదేళ్లు ప్రయాణిస్తారని.. తాను ఒకేసారి నాలుగు సినిమా చేస్తానని చెప్పారు చిరు.

Read more RELATED
Recommended to you

Latest news