దీపికా-రణ్​వీర్ పెళ్లి వీడియో వైరల్.. కరణ్ జోహార్ ఎమోషనల్

-

బాలీవుడ్‌ పవర్ కపుల్ దీపికా పదుకోణ్-రణ్‌వీర్‌ సింగ్​లు కలిసి కనిపిస్తే చాలు ఫ్యాన్స్​కు పండగే. అలాంటిది ఇద్దరూ కలిసి ఓ ప్రోగ్రామ్​లో పాల్గొంటే.. అందులో తమ పర్సనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకుంటే.. అందులోనూ తమ పెళ్లి వీడియో షేర్ చేస్తే.. ఊహించడానికే ఎంత హ్యాపీగా ఉంది కదా. కానీ ఇది ఊహ కాదు. నిజంగా జరిగింది. ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’లో ఈ పవర్ కపుల్ పాల్గొని.. తమ పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

అంతే కాదండోయ్ వారి పెళ్లి వీడియోను కూడా ఫ్యాన్స్​ కోసం రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసి డైరెక్టర్, షో హోస్టు కరణ్ జోహార్ కంటతడి పెట్టారు. చాలా ఎమోషనల్​గా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీప్​వీర్ జంటను చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ ఇద్దరినీ హగ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

2013లో విడుదలైన ‘రామ్‌ లీలా’ కోసం దీపిక-రణ్‌వీర్‌ తొలిసారి కలిసి పని చేశారు. ఈ సినిమా షూటింగ్​ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట 2018లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 5 సంవత్సరాల తర్వాత వీరి పెళ్లి వీడియో బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version