అల్లూరి, కొమరం భీం లతో అజయ్, రాజమౌళి….ఫోటో చూడ రెండు కళ్ళు చాలవుగా…..!!

-

ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన అత్యద్భుత చిత్ర రాజాలైన బాహుబలి రెండు భాగాల భారీ విజయాలతో తన పేరుని విశ్వవ్యాప్తం చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రతిష్టాత్మక సినిమాని తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తున్న స్కాట్, లేడీ స్కాట్ ల ఫస్ట్ లుక్ లను ఇటీవల రిలీజ్ చేసింది సినిమా యూనిట్. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా ఆయన సోదరుడు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఆర్ఆర్ఆర్ సెట్స్ లోకి అజయ్ దేవగన్ అడుగుపెట్టి షూటింగ్ మొదలెట్టినట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక ప్రకటన వెలువరించింది.

 

ఇక నేడు ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి అజయ్ దేవగన్, దర్శకుడు రాజమౌళి దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది మూవీ యూనిట్. ఈ ముగ్గురు దిగ్గజ నటులతో మా ఆర్ఆర్ఆర్ మూవీ సెట్స్ ఎంతో అద్భుతంగా వెలిగిపోతున్నాయి అంటూ వారు పోస్ట్ చేసిన ఫోటోలను పలువురు మూవీ లవర్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ షేర్స్, లైక్స్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు. మన దేశంతో పాటు విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news