చిరంజీవి తండ్రి వెంకట్రావు నటుడే.. ఆయన నటించిన సినిమాలివే..!

-

‘స్వయంకృషి’తో సినిమాల్లో ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎంతో మందికి ఇన్ స్పిరేషన్ అయ్యారు చిరంజీవి. ఇక ఆయన కుటుంబం నుంచి డజను మందికి పైగా హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ సంగుతులు అలా పక్కనబెడితే.. చిరంజీవి తండ్రి కూడా నటుడేనండోయ్.. ఆయన కూడా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి తండ్రి సాధారణ కానిస్టేబుల్ అన్న సంగతి అందరికీ విదితమే. కానీ చిరంజీవి తండ్రి వెంకట్రావు కూడా సినిమాల్లో నటించారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. చిరంజీవి -బాపు కాంబినేషన్ లో వచ్చిన ‘మంత్రి గారి వియ్యంకుడు’ పిక్చర్ లో ముఖ్యమైన మంత్రి పాత్ర ను వెంకట్రావు పోషించారు.

అలా వెంకట్రావును నటుడిని చేయాలనే ఆలోచన చిరంజీవి మామ అల్లు రామలింగయ్యకు వచ్చింది. అలా ఆయన సలహాతో దర్శకుడు బాపు.. మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు చేత ఆ పాత్ర వేయించారు.

ఈ మూవీ కంటే ముందే వెంకట్రావు ఓ సినిమాలో నటించారు. 1969లో వచ్చిన ‘జ‌గ‌త్ జెట్టీలు’ అనే ఫిల్మ్ లో ఆయన నటించారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల నేపథ్యంలో తను ఉద్యోగం చేశాడు. కాగా, ఆయన నటనా కోరికను ఆయన తనయులు కొనసాగిస్తు్న్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటులుగా కొనసాగుతున్నారు.

చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో త్వరలో పాల్గొననున్నారు. ఓ వైపున రాజకీయాలు, మరో వైపున సినిమాలు చేస్తూ పవర్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్.. ‘భవదీయుడు భగత్ సింగ్’ పిక్చర్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news