తెలుగు చిత్ర సీమలో వారసత్వాన్ని మొదలు పెట్టిన ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అని చెప్పొచ్చు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసులుగా ఆయన తనయులు హరి కృష్ణ, బాలకృష్ణలు ఎంట్రీ ఇచ్చారు. అలా తమ వారసత్వాన్ని వారు ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చారు. కాగా, ఎన్టీఆర్ కేవలం తన కొడుకులను మాత్రమే కాకుండా తన సోదరుడు త్రివిక్రమరావు కొడుకును కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు.
త్రివిక్రమరావు కొడుకు నందమూరి కల్యాణ చక్రవర్తి కూడా తెలుగు చిత్రసీమలోకి కథానాయకుడిగా వచ్చాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘స్వాగతం’ సినిమాలో నటించి..1986లో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కల్యాణ్ చక్రవర్తి నందమూరి. ఫస్ట్ ఫిల్మ్ తోనే సక్సెస్ అందుకున్న ఈ హీరో..రెండో సినిమా ‘తలంబ్రాలు’ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత ఏడాది 1987లోనూ కల్యాణ్ చక్రవర్తి నటించిన నాలుగు సినిమాలు ఘన విజయం సాధించాయి.
అలా వరుస విజయాల్లో ఉన్న కల్యాణ్ చక్రవర్తి 1988లోనూ పలు సినిమాల్లో నటించారు. కానీ, అందులో కొన్ని ఫిల్మ్స్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో చిత్ర సీమ నుంచి గ్యాప్ తీసుకున్న నందమూరి కల్యాణ్ చక్రవర్తి..2003లో ‘కబీర్‌దాస్’ పిక్చర్ లో కనిపించాడు. అది కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో ఇక వ్యాపారంపైన కాన్సంట్రేట్ చేశాడు. ప్రస్తుతం నందమూరి కల్యాణ్ చక్రవర్తి తన వ్యాపారంపైన ఫోకస్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. పెదనాన్న ఎన్టీఆర్ పోలికలతో వెండితెరపైన నందమూరి అభిమానులను కొంత కాలం పాటే అలరించగలిగాడు హీరో నందమూరి కల్యాణ్ చక్రవర్తి.