90ల్లో అగ్ర కథానాయకుల రెమ్యున‌రేష‌న్‌.. బ‌డ్జెట్‌.. ఆరోజుల్లో అదే ఎక్కువ‌!!

-

ప్రతీ రంగంలో రోజురోజుకూ గణనీయమైన మార్పులు జరుగుతుండటం సహజం. అలా అప్పటి సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. అప్పట్లో ఫిల్మ్ కు బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు భయపడేవారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెద్ద సినిమాలు చేసేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. వేల కోట్ల రూపాయలు పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. దాంతో మార్కెట్ బాగా పెరిగిపోతున్నది. ఫలితంగా స్టార్స్ రెమ్యునరేషన్ కూడా పెరుగుతున్నది.

ఒకప్పటి పరిస్థితులు అయితే ఇప్పటిలా లేవని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అప్పట్లో ఒక్క సినిమాకు కనీసంగా లక్షల్లో అయినా బడ్జెట్ పెట్టాలంటే స్టోరి గురించి, మేకర్స్ గురించి ఆలోచన చేసేవారు. కానీ, ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు బోలెడన్ని వస్తున్నాయి. అందుకు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ సినిమా అడుగులు వేసిందని చెప్పొచ్చు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ప్రతీ ఒక్క నిర్మాత పెద్ద సినిమా చేయడంపైన హోప్స్ పెట్టుకుంటున్నారు.

అప్పటి సినిమా అగ్ర కథానాయకులు అనగా 1980,90ల్లో ఉన్న వారికి ఇప్పటి తరం అగ్ర కథానాయకుల పారితోషికాన్ని పోల్చి చూడటం సరి కాదు. ఎందుకంటే పరిస్థితుల్లో మార్పు సహజం. కాగా, అప్పటికి ఇప్పటికి సినిమా మేకింగ్ లో అయితే చేంజెస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటి, ఇప్పటి స్టార్ హీరోల రెమ్యునరేషన్ ను ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు బన్నీ (అల్లు అర్జున్), ప్రభాస్, రామ్ చరణ్, తారక్.. రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

sobhan babu shobhan babu
sobhan babu shobhan babu

అప్పట్లో నిర్మాతలు ఆనాటి అగ్రహీరోలు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.. సీనియర్ ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ రూ.40 లక్షలు కాగా, ఆయన పారితోషికం రూ.12 లక్షలు ఉండేది. అప్పట్లో అది భారీ రెమ్యునరేషన్. కాగా, ఏఎన్ఆర్ కు రూ.10 లక్షల పారితోషికం ఇచ్చేవారు. ఆయన పిక్చర్ బడ్జెట్ రూ.30 లక్షలేనట.ఇక నట శేఖర కృష్ణ ఫిల్మ్ బడ్జెట్ రూ.20 నుంచి 26 లక్షల వరకు ఉండగా, ఆయన రెమ్యునరేషన్ గా రూ. 7 లక్షలు తీసుకునే వారు. ‘సోగ్గాడు’ శోభన్ బాబు .. మూవీ బడ్జెట్ రూ.20 లక్షల వరకు ఉండగా, ఆయన రెమ్యునరేషన్ రూ.6 లేదా 7 లక్షలు ఉండేదట. ఇక ఇప్పటి సినిమా బడ్జెట్లు రూ.కోట్లలో ఉంటున్న సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news