వెండితెరపైన కనిపించి ప్రేక్షకులను అలరించాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ, అందరికీ అవకాశాలు దొరకడం కష్టమే. ఒకవేళ అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోతే కనుక ఇక అంతే సంగతులు..కాగా, టాలీవుడ్ కు చెందిన ఈ స్టార్ హీరోలు ఇప్పుడు బాగానే రాణిస్తున్నప్పటికీ ఒకప్పుడు వారు కూడా అవకాశాలు దొరక్కనో లేదా ఇతర కారణాల వల్లనో తెర వెనుకకు వెళ్లిపోయారు. కొంత కాలం తర్వాత హీరోలుగా అవకాశాలు దక్కించుకున్నారు. అలా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి హీరోలుగా మారిన వారి గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహరాజ్ రవితేజ..స్వయం కృషికి మారు పేరు అని చెప్పొచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రవితేజ.. పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా హీరో అయిపోయాడు. త్వరలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
నేచురల్ స్టార్ నాని ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ, నాని తన కెరీర్ ను అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దగ్గర కూడా కొంత కాలం ఆయన పని చేశారు. ‘అష్టాచెమ్మా’ ఫిల్మ్ తో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ప్రస్తుతం ‘దసరా’ సినిమా చేస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్..యూత్ ఫుల్ ఫిల్మ్స్ చేసి తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. రాజ్ తరుణ్ సైతం తొలుత తన కెరీర్ స్టార్టింగ్ డేస్ లో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పని చేశాడు. ‘ఉయ్యాల జంపాల’ పిక్చర్ తో హీరోగా పరిచయమయ్యాడు.
లవర్ బాయ్ గానే తన ఇమేజ్ ను ఇప్పటికీ కొనసాగిస్తున్న హీరో సిద్ధార్థ్ …కూడా తన కెరీర్ ను ఏడీగానే స్టార్ట్ చేశాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో పలు సినిమాలు చేసి తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్న సిద్ధార్థ్..ప్రజెంట్..తమిళ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు.
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ పిక్చర్ తో ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరో నిఖిల్..అంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. తన కెరీర్ లో ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని నిఖిల్ భావిస్తుంటాడు. ‘కార్తీకేయ-2’ చిత్రంతో నిఖిల్ త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు.