Adipurush: ‘ఆదిపురుష్’ అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు ఓం రౌత్..అసంతృప్తిలో ప్రభాస్ అభిమానులు

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆది పురుష్’ అప్ డేట్ శ్రీరామ నవమి సందర్భంగా కచ్చితంగా మేకర్స్ ఇస్తారని ప్రభాస్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఆదిపురుష్’ దర్శకులు ఓం రౌత్ ఆదివారం ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. కాగా, అది చూసి ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటుందో అనే ఆత్రుతో ఎదరు చూస్తున్న ఫ్యాన్స్ కు ఓం రౌత్ ఇచ్చిన సర్ ప్రైజ్ పెద్దగా నచ్చలేదు.

డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కాని మేకింగ్ వీడియో కాని రిలీజ్ చేయలేదు. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ను వీడియో రూపంలో విడుదల చేశారు. అది చూసిన ప్రభాస్ అభిమానులు ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు. సదరు వీడియో తమకు సంతృప్తినివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలం నుంచి ప్రభాస్ ను రాముడిగా చూడాలనుకుంటున్న తమకు సరైన ట్రీట్ ను రామనవమి సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ ఇవ్వలేదని అంటున్నారు.

వచ్చే ఏడాది జనవరి 12న ‘ఆదిపురుష్’ ఫిల్మ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ బాడీ ప్లస్ లాంగ్వేజ్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీ, సంస్కృతంలో పట్టు సాధించిన ప్రభాస్..సీన్స్ బాగా రావడం కోసం ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం. ఇందులో ప్రభాస్ కు జోడీగా ‘సీత’గా కృతి సనన్ నటిస్తోంది. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. 3D వర్షన్ లో ఈ చిత్రం అత్యద్భుతంగా ఉండబోతున్నదని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news